ధరల అంపశయ్య మీద
భీష్ముడు వాడు
సమస్యల కంటక కిరీటధారి వాడు
చావు బ్రతుకుల మద్య వ్రేలాడే
గబ్బిలం వాడు
రోజుకో ఆశ చిగురించే
జీవికావల్లిక వాడు
కాలాగ్నిలో కరుగుతున్న
కలల్ని కనే
నిస్సంతు వాడు
ఇంకా అర్థం కాలా?
నేటి సామాన్య జీవి వాడు
శ్రీ అంజిబాబు గారి కలం నుండి..
గురువారం 6 అక్టోబర్ 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 స్పందనలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి