17, ఏప్రిల్ 2012, మంగళవారం

విరహమధురం

‎నీవు లేక నిదుర రాక,
కలలు అన్ని కాలరాసి,
విరహమంతా వత్తి చేసి,
కోరికంతా జ్వాల చేసి,
మనసునంతా దహించేసి,
నాలో నేను సమీరంలా,
పాటలాగా పరుగు తీసి,
నీలో కలిసే క్షణంకోసం,
చెలీ,
మధురమై నే ఎదురు చూసా...

వెన్నెల కలం నుండి..

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

మీ ప్రయత్నం అభినందనీయం.

దయచేసి అన్యధా భావించకండి - విరహమధురం అన్నిది సరైన సమాసం కాదు.
విరహమాధుర్యం అనటం సరిగా ఉంటుంది. లేదా మధురవిరహం అన్నా బాగుంటుంది.

అలాగే భాషాపరంగా మీ కవితలో కూడా కొన్ని దొసగులు ఉన్నాయి. కలలు +అన్ని --> కలలన్ని అవుతుంది కాని సంధి చేయకుండా ఉంచలేము. ఇది నిత్యసంధి కదా. అలాగే అసలు 'అన్ని' బదులు 'అన్నీ' అనాలి కదా. సరి జేస్తే కలలన్నీ అంటే సరిపోతుంది. ఇలా మరికొన్ని కూడా..

Padmarpita చెప్పారు...

nice...