10, ఫిబ్రవరి 2010, బుధవారం

మూసిన గుప్పెట

అడవిలో కోతుల్ని పట్టటానికి ఒక పధ్దతి వుంటుంది. చిన్న మూత వున్న కుండలో పండు పెట్టి అందుబాటులో వుంచుతారు. కోతి చేయి పెట్టి పండు పట్టుకుంటుంది. గుప్పెట మూసి వుంటుంది కనుక చేయి బయటకు రాదు. గుప్పెట వదిలితే పారిపొవచ్చన్న తెలివితేటలు ఆ కోతికి వుండవు.

Software professionals తో పని చేయించుకోవడానికి ఒక పధ్దతి వుంటుంది. జీతంలో పెంపు, contact sign లాంటి ముందరి కాళ్ళకు బంధనాలు, చెప్పింది చేయటమే జీవితానికి పరమ సాఫల్యములాంటి ప్రతిభోధితాలు, ఇది తప్ప వేరే ఏది జీవితం కాదన్న ముక్తాయింపు. గుప్పెట మూసి వుంటుంది కనుక అదే లోకం అనుకుంటారు. అనుకూలమైన ప్రయోజనాలకంటె ప్రతికూలమైన కోల్పోవటాలే ఎక్కువన్న విషయం తెలుసుకునేటంత తెలివితేటలు వీళ్ళకు వుండవు.

కామెంట్‌లు లేవు: