10, ఏప్రిల్ 2010, శనివారం

ప్రపంచం ముందరకెళ్తోంది.

officeలో సోమవారం నుండి గురువారందాకా ఎలా వున్నా శుక్రవారం మాత్రం కళ్ళకు ఇంద్ర ధనుస్సు పెట్టుకున్నట్లుంటుంది.

సౌమ్యంగా చెప్పాలంటే - సీతాకోక చిలుకల్ని అడవి మధ్యలో సెలయేరు పక్కన నిలబడి చూస్తున్నట్లుంటుంది.
నా మాటల్లో చెప్పాలంటే - ఈ జీవితానికిది చాలు, ఆడవులకెళ్ళి తపస్సు చేసుకుందామనిపిస్తుంది.
చంద్ర మౌళి మాటల్లో చెప్పాలంటే - పిల్ల కత్తిలా వుంది, పరిచయం పెంచుకుందామా అనేట్లుటుంది.

అసలు విషయానికి వస్తే నా పూర్వ జన్మలో నేను దూరదర్శన్ లో పని చేసేవాడిననుకుంటా. నా అవతారం మాత్రం జన్మ మారినా అలాగే వుండిపోయింది. ప్చ్.. అదేంటో నేను ఏం వేసుకున్నా పది వరకు పల్లెటూళ్ళో చదివి ఇంటరుకు పట్నాణికొచ్చిన పిల్లాడిలాగే వుటుంది. నేను చేసే పనిలో ఎంత సృజనాత్మకత వుటుందో, ఆహార్యం అంత దరిద్రంగా వుటుంది అని నా గట్టి నమ్మకం.

ఈ ఆత్మారాముని శల్య సారథ్యానికి తోడు, చుట్టూ సీతాకోక చిలుకలు.
ఇక చూస్కో, ప్రపంచం ముందరకెళ్ళిపోతోందిరా చంద్రమౌళి ఒకటే గొడవ.
సర్లే మనమూ ప్రపంచంతోపాటె నడుద్దాం అని ఈ మధ్యే కాస్త వేషం మార్చా. పరిస్థితి కాస్త మెరుగు.

కాని ఈ రోజు, మారిన నా అభిప్రాయాన్ని మళ్ళీ మార్చుకొనే సంఘటన జరిగింది.
ఎప్పుడు జీన్స్ వేసుకునే అమ్మాయి ఈ రోజు చీర కట్టుకొనొచ్చింది.
చంద్ర మౌళి మనసు వెంటనే సౌమ్యంగా అయిపోయింది.
అందాన్ని కేవలం కళ్ళతో అనుభవించడానికి, మనసుతో కలిపి ఆస్వాదించడానికి మద్య ఎంత దూరమో తెలిసిపొయింది.

ముఖ్యంగా వేషాన్ని కొత్తగా మార్చకోవడం కాకుండా, ఆలోచనల్ని నవ్యంగా వుంచుకుంటే జీవితం దివ్యంగా వుంటుందనిపించింది.
ప్రపంచం ఎంత ముందరికెళ్ళినా, మన సాంప్రదాయం సోయగం తగ్గదనిపించింది.

నప్పని కొత్త style కన్నా , నచ్చే dignified నాకు సరిపోతుందనిపించింది.

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

definately you gave good message
https://goo.gl/Yqzsxr